శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి  జాతర రాష్ట్ర స్థాయి గిరిజనోత్సవం….

జయజయహే : మన్యం దేవత గిరిజనుల కల్పవల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి  జాతర రాష్ట్ర స్థాయి గిరిజనోత్సవం ఘనంగా జరగనుంది . ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరు మన్యం ప్రాంతం. దట్టమైన అరణ్యం, పారే సెలయేర్లూ, ఎత్తైన కొండ శిఖరాలూ, పచ్చని చెట్లూ... ఇలా వన సౌందర్యానికి ఉదాహరణగా నిలిచే పాడేరులో గిరిజనుల దేవతగా కొలువుదీరి పూజలు అందుకుంటున్న మన్యం దేవత.. గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం.. పాడేరు మోదకొండమ్మ తల్లి. విశాఖపట్నానికి...