SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 12:09 pm Posted by : SHIVASURYA NEWS

శ్రీశ్రీశ్రీ ముసలి తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్

అనకాపల్లి : జయజయహే : అనకాపల్లి బైపాస్ రోడ్డు దగ్గర్లో శ్రీశ్రీశ్రీ ముసలి తల్లి అమ్మవారి* పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా మళ్ళ సురేంద్ర మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల శ్రీ ముసలి తల్లి అమ్మవారి పండగను నిర్వాహకులు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రజలందరికి శ్రీ ముసలి తల్లి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొణతాల శ్రీనివాసరావు, కాండ్రేగుల రవణ అప్పారావు, కాండ్రేగుల శంకర్రావు, కాండ్రేగుల నాగేశ్వరరావు, కొణతాల శివ సత్యనారాయణ, కొణతాల సంతోష్, మళ్ళ సూరిబాబు, బుద్ధ గంగాధర్, ప్రసాద్, కొణతాల పృద్వి, మరియు పైలా గోపి, ఎస్. భానుచందర్ (అఖి), జొన్నాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు