శ్రీశ్రీశ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న నగర మేయర్
విశాఖపట్నం : జయజయహే : విశాఖ నగర పరిధిలోని పెదగదలి అలాగే పెదవాల్తేరు లో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మ వార్ల వార్షిక మహోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కుటుంబ సమేతంగా మంగళవారం పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవార్ల వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందని అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నామని, అమ్మవారు నగర ప్రజలను కాపాడాలని...