Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీశ్రీశ్రీశ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న నగర మేయర్

శ్రీశ్రీశ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న నగర మేయర్

విశాఖపట్నం : జయజయహే : విశాఖ నగర పరిధిలోని పెదగదలి అలాగే పెదవాల్తేరు లో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మ వార్ల వార్షిక మహోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కుటుంబ సమేతంగా మంగళవారం పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ కకచెట్టు పోలమాంబ అమ్మవార్ల వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందని అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నామని, అమ్మవారు నగర ప్రజలను కాపాడాలని నగరాభివృద్ధి జరిగేటట్లు చూడాలని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం లో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని అందించారు. ఈ పండగ మహోత్సవంలో గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?