SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 11:11 am Posted by : SHIVASURYA NEWS

శ్రీవారి సుప్రభాత సేవలో అనకాపల్లి ఎం.పీ

అనకాపల్లి : జయజయహే : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ శనివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబసమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించికున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి,ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా సి.ఎం రమేష్ మాట్లాడుతూ స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబసమేతంగా పాల్గొని స్వామివారి దివ్య దర్శనం పొందడం ఒక అపూర్వ అనుభూతి అని పేర్కొన్నారు. శ్రీవారి అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం,అభివృద్ధి ఉండాలని ప్రత్యేకంగా ప్రార్ధించినట్లు తెలియజేశారు.