శ్రీకాకుళం మార్కెట్, కొత్తశోభ దిశగా అడుగులు
అంధవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలో ఎమ్యెల్యే గొండు. శంకర్ శ్రీకాకుళం : జయజయహే : మార్కెట్ మర్చెంట్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దమార్కెట్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో అంధవరపు తవిటయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న స్థానిక ఎమ్యెల్యే గొండు. శంకర్, తవిటయ్య కుటుంబ సభ్యులతో విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించి మాట్లాడుతూ ప్రముఖులు, మాజీ శాసన సభ్యులు అంధవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలు నా హయాంలో జరగటం ఆనందదాయకమని, అంధవరపు తవిటయ్య కుటుంబంతో మా చిన్ననాటి నుండే సత్సంబంధాలున్నాయని,...