SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 10:06 am Posted by : SHIVASURYA NEWS

శ్రీకాకుళం మార్కెట్, కొత్తశోభ దిశగా అడుగులు

అంధవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలో ఎమ్యెల్యే గొండు. శంకర్

శ్రీకాకుళం : జయజయహే : మార్కెట్ మర్చెంట్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దమార్కెట్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో అంధవరపు తవిటయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న స్థానిక ఎమ్యెల్యే గొండు. శంకర్, తవిటయ్య కుటుంబ సభ్యులతో విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించి మాట్లాడుతూ ప్రముఖులు, మాజీ శాసన సభ్యులు అంధవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలు నా హయాంలో జరగటం ఆనందదాయకమని, అంధవరపు తవిటయ్య కుటుంబంతో మా చిన్ననాటి నుండే సత్సంబంధాలున్నాయని, సేవలకుచిరునామా తవిటయ్యగారని గుర్తుచేశారు. మార్కెట్ కు కొత్త శోభ తీసుకొస్తామని, వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కొద్దీ రోజుల్లో పనులు జరుగుతాయని అందుకుమనమంతా సిద్ధం కావాలన్నారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ పైడిశెట్టి జయంతి, అంధవరపు సంతోష్, ప్రసాద్, కార్యక్రమ ముఖ్య కారకులు కోరాడ. హరిగోల్ , కొరడా రమేష్, మాట్లాడుతూ తవిటయ్య గారి విశిష్టత, మార్కెట్ వర్తకుల ఔన్నత్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మర్చెంట్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దమార్కెట్ శ్రీకాకుళం సభ్యుల బృందం, అంధవరపు. తవిటయ్య కుటుంబ సభ్యులు, స్థానికులు, వ్యాపారస్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.