శ్రమజీవుల సంబరం – మే డే

మానవ నాగరికత అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది. వారి శ్రమ, పట్టుదల, అంకితభావమే సమాజ అభివృద్ధికి మూలస్తంభం. ఈ క్రమంలో కార్మిక హక్కుల సాధనకు చారిత్రాత్మకంగా రూపుదిద్దుకున్న ప్రత్యేక దినం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) మేడే చరిత్ర – పోరాటం నుండి గౌరవం దాకా 1870 దశకానికి ముందు వరకూ కార్మికులు రోజుకు 12-16 గంటలు పనిచేయడం సర్వసాధారణంగా వుండేది. తక్కువ వేతనం, హింసాత్మక పరిస్థితులు, అసమానతలు వారి జీవన విధానంగా సాగేవి ఈ అన్యాయ పరిస్థితులను ఎదిరిస్తూ 1886...