వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చెయ్యొద్దు ..సుప్రీమ్ కోర్టు.
జయజయహే : వైసీపీ రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో చోటు చేసుకుందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ కు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. మిథున్ రెడ్డికి ఊరటనిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోరుతూ...