SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 6:57 am Posted by : SHIVASURYA NEWS

వైసిపి సోషల్ యాక్టివిస్ట్ అండగా ” వాసుపల్లి”

కోర్టు ఖర్చులకు రూ.5 వేలు అందజేత కూటమి నేతల పై పోస్ట్ లు పెట్టారనే నెపంతో అతని పై వన్ టౌన్ లో కేసు – స్టేషన్ జామీను ఇప్పించిన వాసుపల్లి

విశాఖపట్టణం : జయజయహే : వైసిపి కార్యకర్తలకు విశాఖ దక్షిణ మాజీ వాసుపల్లి గణేష్ కుమార్ అండగా ఉంటున్నారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా అది తన కష్టంలా భావించి ముందుంటున్నారు.తన పరిధి మీద వారికి సహాయం చేస్తున్నారు.అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తున్నారు.ఇటీవల గుడివాడ కి చెందిన వైసిపి సోషల్ యాక్టివిస్ట్ నక్కెళ్ళ శ్యామ్ కూటమినేతలపై తప్పుడు ప్రచారం చేశారనే అభియోగంతో అతనిపై విశాఖలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. సమాచారం తెలుసుకున్న వాసుపల్లి గణేష్ కుమార్ స్థానిక నాయకులకు కార్యకర్తలకు సమాచారం చేరవేసి అప్రమత్తం చేశారు. వారిని స్టేషన్ కి పంపించారు. వాసుపల్లి చొరవతో అతనిని బయటకు తీసుకొచ్చారు. 104 ఏరియాలోని తన కార్యాలయంలో కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేలును నక్కెళ్ళ శ్యామ్ అందజేశారు.

కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు..

మంచి పాలన అందించాలని ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు చర్యలు టార్గెట్గా పాలన సాగిస్తుందని వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. వైసీపీ నాయకులు అలాగే వైసిపి కార్యకర్తల పై తప్పుడు కేసులు బనాయిస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి వైసిపి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరైనది కాదని చెప్పారు. ప్రజలు అంత గమనిస్తున్నారని పరిస్థితులు అనేవి ఒకేలా ఉండమని తప్పకుండా వచ్చే ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు. పోలీసులు కూడా కూటమినేతలు చెప్పినట్లు కాకుండా ధర్మంగా వ్యవహరించాలని కోరారు.