చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజామున గృహప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో కుప్పంలో ప్రతి ఇంటా సందడి నెలకొంది. సొంత కుటుంబ సభ్యుడే గృహప్రవేశం చేస్తున్నట్లు కుప్పం వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం లో కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకే గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ కుటుంబ సభ్యులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలవనున్నారు. ఈ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపనున్న వారి కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పసందైన పలు రకాల విందు వంటకాలూ సిద్ధం చేశారు.

కాగా, కుప్పంలోని కొత్త ఇంటి గృహప్రవేశం నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రికే కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు తరఫున ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.