వైఎస్సార్ జిల్లా పేరు కడప గా మార్చేసిన చంద్రబాబు-మహానాడు వేళ కీలక ఉత్తర్వులు..!

కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు, జిల్లాల పేర్లను అధికార పార్టీలు మార్చేస్తున్నాయి. ఇదే క్రమంలో కీలకమైన వైఎస్సార్ జిల్లా పేరును మారుస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ జిల్లా పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంది. దీన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంత వరకూ ఈ జిల్లా పేరు కడపగానే ఉండేది....