వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు మంగళవారం వంశీకి బెయిల్ మంజూరు చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ దక్కింది. వంశీతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. వల్లభనేని వంశీని 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్...