ముంజులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు
మాడుగుల: జయజయహే : తాటి ముంజ పేరు చెప్పగానే అందరికీ నోరూరుతుంది. దీన్ని వేసవి అతిథిగా, సీజనల్ ఫ్రూట్, పిలుస్తారు. ఇది శరీరంలో టాక్సిన్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది, ఇది శరీర సహజ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఐస్ యాపిల్ లేదా నంగు సహజ శీతలకరణి, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తాటి ముంజెల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు పరిశీలిస్తే..తాటి ముంజెలు ఎండధాటి నుంచి రక్షణ కల్పిస్తాయి. 100గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు ఉంటాయి. మూడు తాటి ముంజెలు తిన్నట్లయితే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది. లేత తాటిముంజెల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది.
వీటిలో విటమిన్లు,ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజెలు చక్కని ఫలహారం. ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటిముంజెల నీటిని పట్టిస్తే దురద తగ్గి,అవి త్వరలోనే మానిపోతాయి.కొన్ని ప్రాంతాల్లో తాటిముంజెలతో శీతలపానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజెల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు. ముఖ్యంగా ఈ తాటి ముంజను వేసవి తాపం తీర్చతీర్చగలదని చెబుతుంటారు. తాటికాయల నుంచి ఈ ముంజును వేరుచేసి అమ్మకాలు సాగిస్తుంటారు.గతంలో తాటి చెట్లు ఎక్కువగా ఉన్న సమయంలో చాలా తక్కువ ధరకు అమ్మకాలు సాగించేవారు. అయితే రాను రాను ఈ తాటి చెట్లు కనుమరుగవు తొండడంతో వీటి గిరాకీ కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ తాటి ముంజలు డజను 40 రూపాయల నుంచి 50 రూపాయలకు అమ్మకాల సాగిస్తున్నారు. నగర పట్టణ ప్రాంతాల్లో వీటిదర రెట్టింపు ఉంటది. అయినప్పటికీ సీజన్లవారీగా వచ్చే ఫలాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన రక్షణ కలగలదని భావిస్తారు.

