చోడవరం : జయజయహే : వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే సూచించారు. సోమవారం చోడవరం పట్టణ పరిధిలో గల కోటవీధి, గండి కాలనీ, శివాలయం వీధిలో మంజూరైన నాలుగు చేతి బోర్లు నిర్మాణానికి సోమవారం ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి బోర్లు కానీ, రక్షిత మంచినీటి పథకాలు గాని మరమ్మతులు లేకుండా చూడాలని వేసవి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యలు అధికారులును ఆదేశించారు. అలాగే కొత్తగా ముంజరైన బోర్లు కూడా సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాడి కాసులమ్మ, ఎండిఓ ఆంజనేయులు, సర్పంచ్ బండి నూకాలమ్మ, పంచాయతీ ఈవో నారాయణరావు, తెలుగుదేశం నాయకులు గునురూ మల్లునాయుడు , గునురూ పెదబాబు , సకురు కోటేశ్వరరావు ,దేవరపల్లి వెంకట అప్పారావు, మచ్చీరాజు , గండి మూర్తి , ఎంపీటీసీ చిన్న, నాయుడు పప్పు శ్రీను, వార్డు మెంబర్ సంతోష్ , వార్డు మెంబర్ శేషు దివ్య , శివాలయం ఛైర్మన్ గునూరు సురేష్ ,గర్ల్స్ హై స్కూల్ ఛైర్మన్ గుమ్మల సత్తిబాబు , ఎస్సీ సెల్ సెల్ అధ్యక్షులు మల్లిబాబు , పార్థు రాజు , బొబ్బిలి ఈశ్వరరావు , గండి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో నీటి ఎద్దులు లేకుండా చర్యలు చేపట్టండి ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు
0
44
Previous article
Next article
RELATED ARTICLES

