SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 10:29 am Posted by : SHIVASURYA NEWS

వృత్తే దైవంగా పనిచేసిన బొల్లాప్రగడ వెంకట రామారావు సేవలు శ్లాఘనీయం: ఏ ఎమ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్

అగనంపూడి: జయజయహే : సి డబ్ల్యూ సి లో జీవీఎంసీ 85 పారిశుద్ధ్య కార్మికులు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 తేదీన ఉద్యోగ విరమణ చేయుచున్న సిక్స్త్ జోన్ శానిటరీ సూపర్వైజర్ బొల్లాప్రగడ వెంకట్ రామారావు కి ముఖ్య అతిథి గాజువాక జోన్ ఏఎంహెచ్వో డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్ చేతుల మీద ఘనంగా సన్మానం జరిగింది. అనంతరం ఆయన ప్రసంగిస్తూ విశాఖ నగరం పరిశుభ్రము గా ఉంచుటలో పారిశుధ్యం కార్మికులు పాత్ర కీలకమైనదని అటువంటి శాఖలో బీవీ రామారావు గాజువాక జోన్లో శానిటరీ ఇన్స్పెక్టర్ ,శానిటిరి సూపర్వైజర్ గా విశిష్ట సేవలు అందించారు. కరోనా సమయంలో ఎవరు పైకి రాని పరిస్థితుల్లో పారిశుద్ధ కార్మికులచే ఎంతో ప్రజలు ఇబ్బంది పడకుండా పారిశుద్ధ్య పనులు చేపించారు. విజయవాడలో వచ్చిన బీభత్స వర్షాలకు ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ కి మన పారిశుద్ధ్య కార్మికుల తీసుకుని వెళ్లి ఆ ప్రాంతం పరిశుభ్రం చేయడంలో అచ్చట ప్రశంసాలు పొందారు ఆయన ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆర్య ఆరోగ్యాలతో ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరారు. ఏడిసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ బి.వి.రామారావు 38 సంవత్సరాల సర్వీసులో తన వృత్తిలో ఎనలేని సేవలు చేశారు. హుదూత్ తుఫాన్ కి చల్లా చదరమైన అగనంపూడి ప్రాంతంలో యుద్ధ ప్రాధిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా చెట్లు తొలగించారు త్రోవలో క్లియర్ చేపించడంలో తన సిబ్బంది చే కష్టపడి పని చేపించారు. విశాఖ నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో మన నగరానికి అవార్డులు రావడానికి మన జోన్ నుండి చేసిన సేవ ఎనలేనిది. జీవీఎంసీ గతంలో 56 ,57 వార్డులు విభజన తర్వాత 79 ,85 వార్డుల్లో అగనంపూడి ప్రాంతంలో సుదీర్ఘమైన సర్వీసు చేశారు. ఆయన సేవలను గుర్తించి జీవీఎంసీ ఉన్నతాధికారులు పలుమార్లు ప్రశంస పత్రాలు అందజేయడం జరిగినది అని అన్నారు.

బొల్లాప్రగడ వెంకట రామారావు ఉన్నట్లాడుతూ నేను 38 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగ విరమణ ప్రశాంతంగా చేయడానికి నాకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించిన పారిశుధ్య కార్మికులకు నా శాఖ ఉన్నతాధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గాజువాక మేజర్ పంచాయతీలో శానిటరీ మేస్త్రిగా గాజువాక మున్సిపాలిటీ లో శానిటరీ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి భీమిలి అనకాపల్లి ,అగనంపూడి మరియు ఇప్పుడు 70 వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్గా ఆరోవ జోన్ శానిటరీ సూపర్వైజర్ గా ఉద్యోగ విరమణ చేయుచున్నాను. నా సర్వీసులో అగనంపూడి ప్రాంతం మరువలేనిదని అన్నారు. జీవీఎంసీ 85 వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ బి సీతారామయ్య సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 85 వార్డులో ఉన్న సచివాలయాల పర్యవరణ ,శానిటరీ కార్యదర్శులు

కే రాంబాబు, సిహెచ్ కనకేశ్వరరావు, జె నరేష్, ఎస్ శివ గణేష్ ,ఎం శ్రీను శానిటరీ సూపర్వైజర్లు సిహెచ్ నాగమణి, టి భాను ప్రసాద్ కొండయ్య వలస ఎంపిపి పాఠశాల కో ఆప్షన్ నెంబర్ గోపిశెట్టి పద్మ స్థానిక నాయకులు కరణం పైడ్రాజు మరియు వార్డు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.