SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 9:38 am Posted by : SHIVASURYA NEWS

వీరి ఆకలి తీర్చండి … – ఐ ఎక్సప్రెస్ సత్యవరపు.లక్ష్మణ రావు

శ్రీకాకుళం: జయజయహే : అన్నార్థులకు, నిస్సహాయులకు, నిరుపేదలకు ఆకలితీర్చటంలో ఉండే సంతోశానికి అవధులు ఉండవని, ఐ ఎక్సప్రెస్ సత్యవరపు.లక్ష్మణ రావు, రమాదేవి దంపతులు మంగళవారం అన్నారు. స్థానిక గొంటి వీధిలోగల పట్టణ నిరాశ్రయుల వసతిగృహంలో సుమారు నలబై మందికి అల్పాహారం అందించి మాట్లాడుతూ వీరు తినటానికి పడుతున్న కష్టాలను పలు పత్రికలలో చూస్తున్నామని ఈ రోజు మా చిన్న కుమారుడు ఈశ్వర్ ఆదిత్య జన్మదినం సందర్భంగా అల్పాహారాన్ని అందించామని, మన ఇంటిలో జరిగే వేడుకలను ఇక్కడ అన్నదానసేవా రూపంలో జరుపుకుంటే వారి ఆనందంతోపాటు, వారి ఆకలి తీర్చేవాళ్ళమౌతామన్నారు. వేడుకలకు వృధాగా ఖర్చుపెట్టేబదులు, వృధా ఖర్చును వీరికి ఏదోఒక రూపంలో సహాయమందిస్తే, వారు గడుపుతున్న చివరి క్షణాలను ఆనందంతో గడుపుతారన్నారు. అనంతరం పలుముఖ్య కూడలిలో నిస్సహాయులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో సదరన్ ట్రావెల్స్ సిహెచ్.ఉత్తమ్ కుమార్, నంది.ఉమా శంకర్, బి.జగదీశ్, ఉర్లం. శివతేజ తదితరులు పాల్గొన్నారు.