Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీవి ఎం ఆర్ డీ ఎ చైర్మన్ ప్రణవ్ ఆకస్మిక తనిఖీ

వి ఎం ఆర్ డీ ఎ చైర్మన్ ప్రణవ్ ఆకస్మిక తనిఖీ

విశాఖపట్నం జయ జయహే: వి ఎం ఆర్ డి ఎ ఉద్యోగ భవన్ లో అన్ని విభాగాల్లో వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగి సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, సంస్థకు వచ్చే ప్రజలకు, ఫిర్యాదిదారులకు జవాబుదారీతనంగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వారిని ఒకే పనిమీద మాటిమాటికి సంస్థ చుట్టు తిరగకుండా చూడాలన్నారు. వి ఎం ఆర్ డి ఎ కి చెందిన భూముల పరిరక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని సూచించారు. సంస్థ కి చెందిన సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ, వి ఎం ఆర్ డి ఎ కి చెందిన విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఇంజనీరింగ్, ప్లానింగ్, ఎస్టేట్, పరిపాలన విభాగాల ఉద్యోగులతో మాట్లాడారు. ఈ పర్యటనలో కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్టేట్ అధికారి దయానిధి, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, పర్యవేక్షక ఇంజినీర్ భవానీ శంకర్ కార్యనిర్వహక ఇంజినీర్ రామరాజు తదితరులు పాల్గొన్నారు

                           

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?