వి ఎం ఆర్ డి ఎ సమావేశమందిరంలో ఫిర్యాదులపై చైర్మన్ సమీక్ష

మంగళవారం వి ఎం ఆర్ డి ఎ సమావేశమందిరంలో ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా వి ఎం ఆర్ డి ఎ చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సామాన్య ప్రజలు మనపై ఎంతో నమ్మకం కలిగి ఇచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, న్యాయ...