మంగళవారం వి ఎం ఆర్ డి ఎ సమావేశమందిరంలో ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు అనుగుణంగా వి ఎం ఆర్ డి ఎ చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సామాన్య ప్రజలు మనపై ఎంతో నమ్మకం కలిగి ఇచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, న్యాయ పరమైన చిక్కులు ఉన్నవాటిని మినహాయించి మిగతా వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళికా విభాగానికి అధిక శాతం నివాస స్థలాలకు సంబంధించిన సమస్యలే వస్తాయి కనుక వాటికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కమీషనర్ రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ప్రణాళికాధికారి శిల్పా, ప్రణాళికాధికారులు అరుణవల్లి, మౌనిక, సహాయక ప్రణాళికాధికారులు, పరిపాలనాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.