విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తా… వైఎస్ షర్మిల..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వివిధ సమస్యలపై పోరాటాలకు దిగుతున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మరో కీలక ప్రకటన చేశారు. కార్మికులకు జీతాలు చెల్లించకుండా వేధిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీరుపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు యాజమాన్యానికి డెడ్ లైన్ కూడా ఇచ్చారు. ఎల్లుండి లోగా సమస్య పరిష్కారం కాకపోతే ప్లాంట్ ముందు ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు. విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి అని ఎక్స్ లో వైఎస్ షర్మిల...