SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 8:00 am Posted by : SHIVASURYA NEWS

విశాఖ మేయర్ ను కలిసిన వి.ఎం.ఆర్.డి.ఎ చైర్మన్

విశాఖపట్నం : జయజయహే : విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ గా పదవి బాధ్యతలను చేపట్టిన పీలా శ్రీనివాసరావు గారిని వి.ఎం.ఆర్.డి. చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి, అభినందించారు. అనంతరం వి.ఎం.ఆర్.డి. చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ గారు మాట్లాడుతూ వి.ఎం.ఆర్.డి. సహకారం మరియు సమన్వయంతో విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.