SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 6:13 am Posted by : SHIVASURYA NEWS

విశాఖ మేయరు పీలా శ్రీనివాసరావు

ఏకగ్రీవంగా ఎన్నిక

ప్రతిపాదించిన ఎమ్మెల్యే వంశీ

బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

జయజయహే : మహా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారని విశాఖ జాయింట్ కలెక్టర్, ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి మాట్లాడుతూ జీవీఎంసీ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం జీవీఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా బి-ఫారమ్ టికెట్ 96 వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ సమర్పించారని, పీలా శ్రీనివాసరావు ను మేయరు అభ్యర్ధిగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాదించగా, ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు బలపరిచారని, ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు మొత్తం 73 మంది హాజరు కాగా మేయర్ ఎన్నికకు సరిపోయిన కోరం ఉన్నందున మరో అభ్యర్థి పోటీలో లేనందున మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు. అనంతరం మేయరుగా పీలా శ్రీనివాసరావు చే ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి ప్రమాణా స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా కూటమి శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్, విష్ణుకుమార్ రాజు, పంచకర్ల రమేష్ బాబు, పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ శాశనసభ్యులు మరియు జివిఎంసి ప్రత్యేక ఆహ్వానితులు పీలా గోవింద సత్యనారాయణ, వి.ఎమ్.ఆర్.డి.ఎ చైర్ పర్సన్ ప్రణవ్ గోపాల్, కార్పొరేటర్లు, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, అధికారులు, సిబ్బంది నూతన మేయర్ కు పుష్ప గుచ్చాలు అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.