Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీవిశాఖ నుంచి విజయవాడ విమానం పునరుద్దరణ

విశాఖ నుంచి విజయవాడ విమానం పునరుద్దరణ

ఉత్తరాంధ్ర వాసులకు ఊరట – ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం జయ జయహే: విశాఖ నుంచి విజయవాడకు ఉదయం వేళల్లో విమానాన్ని పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర వాసులకు ఊరటనిచ్చే విషయం. జూన్ 1 వ తేదీ నుంచి ఇండిగో సర్వీసు మళ్లీ ప్రవేశపెట్టడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పూనుకోవడం సంతోషం. ఆయనకు అభినందనలు. ప్రయాణికులకు అనుకూలంగా ఉదయం 7.15 గంటలకు విజయవాడలో బయల్దేరి 8.25 గంటలకు విశాఖ చేరుకునే విమానం… విశాఖలో 8.45 కు బయలు దేరి 9.50 గంటలకు ప్రయాణికులను విజయవాడకు చేరుస్తుంది. సాధారణ ప్రయాణికులు సహా వ్యాపార వర్గాల వారికి ఉపయుక్తంగా ఉండే ఈ సర్వీసు మాదిరిగా మరిన్ని విమానాలను విశాఖ నుంచి ప్రవేశపెడతారని ఆశిస్తున్నా… విశాఖను విశ్వనగరంగా అభివృద్ధికి చేయడానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?