SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 5:35 am Posted by : SHIVASURYA NEWS

విశాఖ డిప్యూటీ మేయర్ యాదవ కులానికే!

రేసులో మొల్లి హేమలత

సామాజిక, రాజకీయ సమీకరణాల్లో పరిశీలన

విశాఖపట్నం జయజయహే : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు త్వరత్వరగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సిపి ఆధీనంలో ఉన్న విశాఖ మేయర్ పీఠం తాజాగా టిడిపి కైవసం చేసుకుంది. అప్పట్లో యాదవ కులానికి చెందిన గొలగాని హరి వెంకట్ కుమారి మేయర్ గా వ్యవహరించారు. తాజాగా తెలుగు దేశం పార్టీ కి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ లో మెజార్టీ బలం కూటమి ప్రభుత్వానికి ఉండటంవల్ల డిప్యూటీ మేయర్ కూడా తెలుగుదేశం పార్టీకే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలువురు కార్పొరేటర్ లో ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే గతంలో యాదవ కులానికి చెందిన వ్యక్తి మేయర్ పీఠం చేపట్టడంతో, ఈసారి డిప్యూటీ మేయర్ యాదవ కులానికి కేటాయించాలని అధిష్టానం భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ నాయకులకు సూచనప్రాయంగా సమాచారం అందించారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం విద్యావంతులైన కార్పొరేటర్ మొల్లి హేమలత, గొలగాని మంగ వేణి పోటీ పడుతున్నారు.అయితే మెజార్టీ మాత్రం విద్యావంతురాలైన హేమలత వైపే ఉందని చెప్పుకుంటున్నారు . మొల్లి కుటుంబీకులు పూర్వం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నారని, ఈ నేపథ్యంలో వారికి న్యాయం చేయాలని పార్టీ భావిస్తుందని తెలుస్తోంది. దీంతో యాదవ కులానికి చెందిన మొల్లి హేమలత డిప్యూటీ మేయర్ గా ఎన్నికై అవకాశం ఉంది.