విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి రాజకీయ రగడ ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జీవీఎంసీలో వైసీపీ కార్పోరేటర్లను తమవైపు తిప్పుకుని మేయర్ పదవిని దక్కించుకున్న కూటమి.. ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మాత్రం తడబాటు ప్రదర్శించింది. డిప్యూటీ మేయర్ గా ఏ పార్టీ కార్పోరేటర్ ఉండాలనే విషయంలో కూటమి పార్టీల మధ్య తలెత్తిన విభేదాలతో ఇవాళ కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. విశాఖ నగర పాలక సంస్ధలో డిప్యూటీ మేయర్ పదవి...