Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీవిశాఖపట్నంకు మంచి రోజులు మొదలయ్యాయి - అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం రమేష్

విశాఖపట్నంకు మంచి రోజులు మొదలయ్యాయి – అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం రమేష్

అనకాపల్లి : జయజయహే : జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది మద్దతుతో కూటమి గెలుపొందింది . గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి స్థానం నుండి జగన్మోహన్ రెడ్డిని దించితే నేడు అదేవిధంగా విశాఖపట్నం కార్పొరేషన్ లో మేయర్,డిప్యూటీ మేయర్ పదవులు నుండి గద్దె దించారు. కూటమి తరుపున త్వరలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కాబోతున్నారు. విశాఖపట్నంకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ నగర అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సాధించారు. కూటమి పాలనలో అనకాపల్లి ప్రాంతం పారిశ్రామికంగాను విశాఖపట్నం ఐటీ పరిశ్రమలతో అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళ్తుంది. భారతదేశంలోనే విశాఖపట్నం నగరం ఉత్తమ కార్పొరేషన్ గా రూపుదిద్దుకోబోతుంది. అవినీతికి పాల్పడిన వైసిపి నాయకులు మీద చట్టపరంగా చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు .

                     

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?