SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 7:33 am Posted by : SHIVASURYA NEWS

విభజన చట్టంలోని సెక్షన్ 26 తీర్పు రిజర్వు….

జయజయహే : తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగేనా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పిన ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అలానే జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదన్నారు. ఇది అసమానత అని.. రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తేడా చేయకూడదని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పిన ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అలానే జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదన్నారు. ఇది అసమానత అని.. రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తేడా చేయకూడదని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు.