విద్యాకుసుమాలకు ‘ప్రశంసల’ పట్టాభిషేకం
'పది'లో మెరిసిన విద్యార్థులకు హోంమంత్రి ఘన సన్మానం సృజన, నైపుణ్యంతోనే చిన్నారుల భవితకు వెలుగు నక్కపల్లి, జయజయహే : హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో విద్యాకుసుమాలకు ప్రశంసల పట్టాభిషేకం జరిగింది. 'పది' ఫలితాల్లో మెరిసిన విద్యార్థులను ఆమె ఘనంగా సన్మానించింది. పాయకరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తమ ప్రతిభను గుర్తించి సత్కరించింది. నక్కపల్లిలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన 'విద్యాకుసుమాల అభినందన' కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి వంగలపూడి...