SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 9:30 am Posted by : SHIVASURYA NEWS

విజన్ 47 బృందంతో ఎంపీపీ సమావేశం

మాడుగుల : విశాఖపట్నం : మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ రాజారం విజన్ 47 కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. 2o47కి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక సౌకర్యాలతో పాటు అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తగు కార్యచరణ రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ప్రతి నియోజవర్గoలోను స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ గా, హెడ్ క్వార్టర్ ఎండిఓ కన్వీనర్ గా నియోజవర్గంలో ప్రత్యేక అధికారితో పాటు, మిగిలిన ఎండివోలు తాసిల్దార్లు సభ్యులుగా కమిటీలో నియమించింది. వీరితోపాటు నియోజకవర్గంలో సమస్యలపై సర్వే చేసేందుకు ప్రత్యేక అధికార బృందానికి కూడా నియమించింది. దీనిలో భాగంగా మాడుగుల నియోజవర్గానికి ఐదుగురు ఉద్యోగులను ఒక ఏడాది పాటు డిప్యూటేషన్ పై నియమించింది. వారితో ఎంపీపీ సమావేశమై విజన్ 47 తీరుతెన్నులు ఏ అంశాల సర్వే జరుపుతారు, ఎక్కడ సర్వే జరుపుతారు, ఎన్నాళ్లు చేస్తారు వంటి వివిధ అంశాలు పై చర్చించారు. ఈ సందర్భంగా సిబ్బంది భాస్కర్, రాము, అప్పలరాజు, రాధాకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ.. ఉదాహరణకు వ్యవసాయంపై సర్వే జరిగినప్పుడు ఆ నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత వనరులపై సర్వే నిర్వహిస్తారు. వ్యవసాయానికి కావలసిన నీరు ఇతర అవసరాల కోసం పరిశీలన జరుపుతారు. సాగునీటి కోసం జలాశయాలు నిర్మాణంలో నిలిచిపోతే బట్ పరిస్థితి తీసుకోవాల్సిన చర్యలు గురించి నివేదిక అందిస్తారు. ఆ విధంగానే అన్ని అంశాలపై కూడా క్షుణ్ణంగా చర్చ జరూపుతారన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన కార్యక్రమాలు, విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, మానవ స్థితిగతులు, నిరుద్యోగ సమస్య భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు వంటి వాటి గురించి సర్వే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించి మాడుగుల నియోజకవర్గం విజన్ 47 నాటికి సమస్యలు లేని ప్రాంతంగా తయారు అయ్యే విధంగా కృషి చేయాలి అన్నారు. ఈ సమావేశంలో కో ఆప్షన్ నెంబర్ ఉన్నిషా, మురళి తదితరులు పాల్గొన్నారు.