వాస్తవ పరిస్థితిని వివరిస్తున్న రేవంత్ – నమ్ముతారా?
జయజయహే : తెలంగాణలోని ఉద్యోగుల సమ్మె ప్రకటన నేపథ్యంలో ఈ సమ్మె ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల ఆయన పదేపదే అప్పు కూడా పుట్టడం లేదని, దేశమంతా ఇదే పరిస్థితి ఉందని నొక్కి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళ్తే పెనం మీద నుంచి పొయిలో పడినట్లే అవుతుందని వాస్తవ పరిస్థితిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితిని పూర్తిగా జనం ముందు...