“వాసుపల్లి” పిలుపుతో ఐక్యత చాటిన వార్డు ప్రెసిడెంట్లు * రూ. 40,000 లు ఆర్థిక సాయం అందజేత.. పోతుస్వామి కుటుంబానికి అండగా నిలిచిన దక్షిణ వైసీపీ శ్రేణులు
విశాఖపట్నం :జయజయహే : మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు దక్షిణ వైసిపి వార్డు అధ్యక్షులందరూ ఐక్యతతో నొల్లు పోతు స్వామి కుటుంబానికి రూ. 40,000 లు ఆర్ధిక సాయం అందించారు. ఈ మేరకు ఆశీలమెట్ట కార్యాలయంలో శుక్రవారం వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా పోతుస్వామి భార్య, కుమారుడు నొల్లు యల్లయమ్మ, నొల్లు చంటి కి నగదును అందజేశారు. ఇటీవల అకాల మృతి చెందిన 37వ వార్డు వైసిపి సీనియర్ నాయకుడు నొల్లు పోతు స్వామి కుటుంబానికి సొంత నిధులతో...