వాసవి మాత జీవిత చరిత్ర పై వ్యాసరచన ఫోటోలు – ఐ ఎన్ పి రామకృష్ణ
విశాఖపట్నం: జయజయహే : ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అమ్మవారి జీవిత చరిత్ర పై వాసవి యూత్ కు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్టు అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణా తెలిపారు.ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.పది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు గల వాసవి యువతీ యువకులు మే 20వ తేదీలోగా 1500 పదాలతో కూడి, పేజీకి 300 పదాలు చొప్పున ఐదు పేజీలలో...