SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 6:03 am Posted by : SHIVASURYA NEWS

వాసవి మాత జీవిత చరిత్ర పై వ్యాసరచన ఫోటోలు – ఐ ఎన్ పి రామకృష్ణ

విశాఖపట్నం: జయజయహే : ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అమ్మవారి జీవిత చరిత్ర పై వాసవి యూత్ కు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్టు అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణా తెలిపారు.ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.పది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు గల వాసవి యువతీ యువకులు మే 20వ తేదీలోగా 1500 పదాలతో కూడి, పేజీకి 300 పదాలు చొప్పున ఐదు పేజీలలో స్వ దస్తూరి తో కానీ, డిటిపి వ్యాసం గాని పంపించాలన్నారు. దానిలో పేరు,చిరునామా, ఫోన్,ఈమెయిల్ అడ్రస్ తో స్కాన్ చేసి విసిఐకి పంపించాలన్నారు. ఈ పోటీలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళం, కన్నడం వంటి ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రాల వారిగా విద్యార్థులను ఎంపిక చేసి నగదు పురస్కారం సత్కారం అందిస్తామన్నారు. “అమ్మవారి జీవితం.. మానవాళికి ఇచ్చే సందేశం”అనే అంశంపైనే వ్యాస రచన పోటీలు ఉంటాయని, కాబట్టి అభ్యర్థులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రచనలు పంపించాలని సూచించారు. పూర్తి చేసిన రచనలను వాసవి క్లబ్స్.ఓ ఆర్ జి జిమెయిల్.కం అనే మెయిల్ అడ్రస్ కు పంపించాలన్నారు.ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ గా అంతర్జాతీయ వాసవి క్లబ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ యమ్మి నారాయణ గుప్తా విహరిస్తున్నారని చెప్పారు.