Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీవావిలాల 22వ వర్ధంతి సందర్భంగా శాసన సభ్యులు నాడు - నేడు పై చర్చా గోష్టి

వావిలాల 22వ వర్ధంతి సందర్భంగా శాసన సభ్యులు నాడు – నేడు పై చర్చా గోష్టి

జయజయహే : జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు గుంటూరులోని రామన్నపేట ఒకటవ లైన్ లో గల జనచైతన్య వేదిక హాలులో పద్మభూషణ్ అవార్డు గ్రహీత స్వాతంత్ర సమర యోధులు కీ||శే|| వావిలాల గోపాలకృష్ణయ్య 22వ వర్ధంతి సందర్భంగా శాసన సభ్యులు నాడు – నేడు అనే అంశంపై చర్చా గోష్టిని నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చర్చ గోష్టిలో వక్తలుగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ శాసన మండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు, కీర్తిశేషులు వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు ప్రముఖ న్యాయవాది వావిలాల సంస్థ సంయుక్త కార్యదర్శి మన్నవ షోడేకర్ ప్రముఖ విద్యావేత్తలు ప్రొఫెసర్ డి ఎ ఆర్ సుబ్రహ్మణ్యం, కన్నా మాస్టర్, మానవత చైర్మన్ పావులూరి రమేష్ తదితరులు ప్రసంగిస్తారు. నేడు చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థులు నిస్వార్థ సేవ, త్యాగ నిరతి, థాతృత్వం, స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర లాంటి మంచి లక్షణాలు ఉంటే నేడు అర్ధ బలం, అంగ బలం లతోపాటు కులము, మతము, ప్రాంతీయ తత్వాలను ప్రోత్సహించే నేతలు పోటీ చేస్తున్నారని ఈ పరిస్థితులు మారడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చా గోష్టిలో చర్చిస్తామని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యం వికసించాలని కోరుకునే ప్రజాస్వామ్య వాదులు, శాసన సభ్యులు, నాడు – నేడు అనే అంశంపై జరిగే చర్చా గోష్టిలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?