Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీవాలంటరీ మెడికల్ ఖర్చులకు వాసుపల్లి చేయూత

వాలంటరీ మెడికల్ ఖర్చులకు వాసుపల్లి చేయూత

జయజయహే : వైసిపి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్న వాలంటరీ వ్యవస్థ రోడ్డున పడేలా కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. గతంలో వాలంటరీగా పని చేసిన ఇంటి పెద్దదిక్కు అంగటి శ్రీనివాసరావు ను తీవ్ర అనారోగ్య పరిస్థితి తెలుసుకుని 27వ వార్డు వైసిపి నేతలతో కలిసి వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. తక్షణమే సొంత నిధులు రూ.10,000 నగదును అందజేసి భరోసా కల్పించారు. 27వ వార్డు దొండపర్తి నెహ్రూ బజార్ 143 సచివాలయంలో అంగటి శ్రీనివాసరావు, ఆయన భార్య అంగటి పార్వతి దంపతులిద్దరూ వాలంటరీ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కూటమి ప్రభుత్వం తొలగించడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మరొక చేదు వార్త వారి కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో నెట్టి వేసింది. కాళ్ల నొప్పులతో ఆసుపత్రికి వెళ్ళగా హిమోక్లిలీయా అంతు చెక్కిన వ్యాధి సోకిగా ఫ్యాక్టరీ ఇంజక్షన్ జీవితాంతం ఉపయోగించాలని డాక్టర్లు సూచించారు. ఇద్దరు చిన్నారులతో కుటుంబ పోషణ ఇబ్బంది పడుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు. ఆర్థిక సాయంతో పాటు మెడికల్ కు అవసరమైన సపోర్ట్ అందిస్తానని వారికి ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వాలంటరీలకు జీతాలు డబుల్ చేస్తామంటూ దొంగ హామీలు ఇచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు యువతను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. అవినీతి రహిత సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారని, యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానిదేనన్నారు. సంక్షేమ ఫలాలు రెట్టింపు చేస్తామని ప్రజలను మోసం చేసి అందలం ఎక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకొని వాలంటరీలకు తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా బీసీ సెల్ అధ్యక్షులు సనపల రవీంద్ర భారత్,27వ వార్డ్ మాజీ డైరెక్టర్ వైస్సార్సీపీ విశాఖ జిల్లా సెక్టరీ పద్మనాభం అమ్మాజీ, 27వ వార్డ్ ప్రెసిడెంట్ నీలపు సర్వేశ్వర రెడ్డి, సౌత్ SC సెల్ అధ్యక్షులు ఆకుల శ్యామ్,మధు రెడ్డి,పిల్లి అజయ్ రెడ్డి,వి టీ కృష్ణ కుమార్,అంగతి కుమార్ ,సాగర్, మౌలేష్, గంగాధర్,రామరాజు,రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?