SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 7:26 am Posted by : SHIVASURYA NEWS

వస్త్రన్నదానం చేసిన లైన్స్ క్లబ్

శ్రీకాకుళం : జయజయహే : వస్త్రం, అన్నదానం, ఇంతకు మించిన దానం ఇంకేముంటుందని లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్ పర్సన్ ఉర్లం శివతేజ పట్నాయక్ అన్నారు. స్థానిక నైట్ షెల్టర్ లో ఉండే నిస్సహాయ, వృద్దులకు లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో సభ్యులు, మదర్స్ హెల్పింగ్ సొసైటీ లైన్ డా. పైడి ప్రదీప్ జన్మదినం సందర్భంగా వస్త్ర, అన్నదానం చేశారు. లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పెర్సన్ ఉర్లం.శివతేజ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్, మెంటార్ నటుకుల. మోహన్, డిసి బడాన. దేవ భూషణ్ సూచనలమేరకు వస్త్రదానం, అన్నదానం చేశామని, జన్మదినాన నిరుపేదలమధ్యలో జరుపుకోవటం ఆనందంగా ఉందని, వీరి ఆకలి తీర్చటంలో భాగమైనందుకు మాటలకందని సంతోశాన్నిచ్చిందన్నారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు లైన్ డా. బొడ్డేపల్లి సురేష్, కార్యదర్శి లైన్ డా. పైడి. సింధూర, కోశాధికారి లైన్ జోగి భారతి, పూర్వపు కార్యదర్శి లైన్ టెక్కం. రామ్ గోపాల్ తోపాటు ఇతర సభ్యులు, నేటి దాత డా. పైడి. ప్రదీప్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నైట్ షెల్టర్ వృద్దులు, చిన్నారులు పాల్గొన్నారు.