వక్ఫ్ పిటిషన్లపై సీజేఐ స్పందన ..! సరైన కారణాలు చూపకపోతే కలుగుచేసుకోలేము

పార్లమెంట్ ఆమోదించిన వివాదాస్పద వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. గతంలో జరిగిన విచారణలో అప్పటి ఛీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా వక్ఫ్ చట్టంలో మూడు క్లాజ్ ల అమలును తాత్కాలికంగా నిలిపేశారు. దీనికి కేంద్రం కూడా అంగీకరించడంతో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. తదుపరి విచారణలో దీన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే తాజాగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన బీఆర్ గవాయ్ మరో న్యాయమూర్తి జస్టిస్ ఆగస్టీన్ జార్జి మాసిహ్ తో కలిసి ఇవాళ...