Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీల్యాండ్ రెవిన్యూ సమస్యలన్నీ ప్రణాళికాయుతంగా పరిష్కరించాలి --జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్

ల్యాండ్ రెవిన్యూ సమస్యలన్నీ ప్రణాళికాయుతంగా పరిష్కరించాలి –జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్

పాడేరు,జయ జయహే : జిల్లాలో ల్యాండ్ రెవిన్యూ సమస్యలన్నీ ప్రణాళికాయుతంగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో రెవిన్యూ సమస్యలపై నిర్వహించిన వర్క్ షాప్ లో కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన రెవిన్యూ సదస్సులలో అందిన ఫిర్యాదుల పరిష్కారం పూర్తీ కాలేదని, ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. రెవిన్యూ పెండింగ్ సమస్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించినందున ఇప్పటికే ఉన్న సమస్యలను నాణ్యవంతంగా పరిష్కరించాలని, అవి కాకుండా రెవిన్యూ అధికారులు గుర్తించిన సమస్యలను కేటగిరీల వారిగా విభజించి సత్వర పరిష్కారం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా అలినేషన్ అఫ్ ల్యాండ్, మ్యుటేషన్, ఆర్ ఓ ఆర్, ఇనాం ల్యాండ్స్ భూ స్థిరీకరణ, రి సర్వే తదితర సమస్యలను, ఆన్ లైన్, ఆఫ్ లైన్ తేడాలను, క్లరికల్ తప్పులను సరిదిద్దాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని సమస్యలు నిబంధల ప్రకారమే పరిష్కరించాలని, నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి వారం వారం ప్రగతి నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, డిఆర్ఓ కె.పద్మలత పాడేరు డివిజన్ 11 మండలాల తహసిల్దార్లు, ఉప తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?