లౌకిక వాదాన్ని రక్షించిన సుప్రీంకోర్టు – జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

జయజయహే : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ బిల్లుపై వచ్చిన 75 పిటిషన్లు పరిశీలించి మే 5వ తేదీ వరకు వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి స్వాగతించారు. రాజ్యాంగం పేర్కొన్న లౌకికవాదాన్ని ఈ తీర్పు రక్షిస్తుందన్నారు. అధికార పార్టీలకు కీలుబొమ్మలుగా మారిన అధికార యంత్రాంగం చేతులో వక్ఫ్ ఆస్తులు...