లోకేష్ కు పదోన్నతి,పార్టీ పూర్తి బాధ్యతలు -మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. దీంతో, రాజకీయంగా కొత్త నిర్ణయాలకు టీడీపీ అధినాయకత్వం సిద్దం అవుతోం ది. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ తొలి మహానాడు కు భారీగా ఏర్పాట్లు చేసారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు వేదికగా కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. టీడీపీలో నారా లోకేష్ కు కీలక పదవి అప్పగించేందుకు మహానాడు వేదికగా నిలవనుంది. ప్రభుత్వంలో ప్రమోష న్ కు సమయం ఉండటంతో.. ముందుగా పార్టీలో ప్రమోషన్ దాదాపు...