Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీలోకేష్ కు పదోన్నతి,పార్టీ పూర్తి బాధ్యతలు -మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం

లోకేష్ కు పదోన్నతి,పార్టీ పూర్తి బాధ్యతలు -మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం


ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. దీంతో, రాజకీయంగా కొత్త నిర్ణయాలకు టీడీపీ అధినాయకత్వం సిద్దం అవుతోం ది. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ తొలి మహానాడు కు భారీగా ఏర్పాట్లు చేసారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు వేదికగా కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. టీడీపీలో నారా లోకేష్ కు కీలక పదవి అప్పగించేందుకు మహానాడు వేదికగా నిలవనుంది. ప్రభుత్వంలో ప్రమోష న్ కు సమయం ఉండటంతో.. ముందుగా పార్టీలో ప్రమోషన్ దాదాపు ఖరారైంది.
మహానాడు వేదికగా కడప వేదికగా మూడు రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేసారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ మహానాడులో తీసుకునే రాజకీయ నిర్ణ యాల పైన ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బాధ్యతలను పార్టీ సీనియర్లకు అప్పగించారు. కాగా, మంత్రి లోకేష్ కు పార్టీలో – ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలని కొంత కాలంగా పార్టీ నేతల నుంచి డిమాండ్ వస్తోంది. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ పైన వివాదం కొనసాగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ పైన జనసేన నేతలు విభేదించారు. దీంతో, ఈ అంశం ఎవరూ ప్రస్తావన చేయవద్దని టీడీపీ ఆదేశించటంతో ఆ చర్చ ఆగిపోయింది.
లోకేష్ కు పట్టం కాగా, ఇప్పుడు పార్టీలో కీలక బాధ్యతల పైన డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షు డి(వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధి ష్ఠానంపై పెద్దఎత్తున ఒత్తిడి వస్తోంది. పార్టీ అధినేతగా – సీఎం బాధ్యతల్లో చంద్రబాబు బిజీగా ఉండటంతో పార్టీ నిర్వహణ ఇక లోకేష్ కు అప్పగించాలనే చర్చ వినిపిస్తోంది. 2014-19 కాలంలో పార్టీని విస్మరించిన కారణంగానే 2019 ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వంపైనే దృష్టి పెడితే పార్టీ దెబ్బతింటుందని, పార్టీ కార్యకలాపాలకు కూడా నిర్ణీత సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి కచ్చితంగా సమయం కేటాయిస్తామని ఆయన చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?