చోడవరం : జయజయహే : కేంద్ర ప్రభుత్వం దేశంలోని కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా లేబర్ కోడ్స్ తెచ్చిందని, ఈ లేబర్ కోడ్స్ రద్దు, కనీస వేతనాలు , రైతులకు గిట్టుబాటు ధర డిమాండ్లతో ఈనెల 20న సమ్మె నిర్వహిస్తున్నట్టు సిఐటియు తెలిపింది. ఆ సమ్మెలో కార్మికులు రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జగూనూరు వరలక్ష్మి, జిల్లా కోశాధికారి వి వి శ్రీనివాసరావు లు పిలుపునిచ్చారు. మంగళవారం చోడవరం లో సీఐటీయూ మండల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ వల్ల సమ్మె చేసే హక్కు , సంఘం పెట్టుకునే హక్కు, పనిగంటలు పెంచడం, పారిశ్రామిక వివాదాలు చట్టానికి తూట్లు పోడవటం వంటి అనేక దుర్మార్గమైన విధానాలు ఈ లేబర్ కోడ్స్ లో పొందుపరిచారని వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకుండా తిప్పికొట్టాలని వారు కోరారు.అందుకే మే20 న దేశవ్యాప్త సమ్మె జరుగుతుందని దీనిలో కార్మికులు, రైతులు, కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. వి నాయుడు, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కె. వరలక్ష్మి, బి. రామలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ నాయకులు కొండమ్మ, రత్నం, నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్ కి వ్యతిరేకంగా కార్మికుల సమ్మె
0
35
Previous article
Next article
RELATED ARTICLES

