లంచం తీసుకుంటూ ఏ సి బి కి పట్టుబడ్డ పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్.

నిజామాబాద్ జిల్లా : జయజయహే : ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మ పట్టబడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలోని సిసి రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో సదరు కాంట్రాక్టర్ వద్ద 7వేల రూపాయల...