Friday, April 17, 2026
Homeశివ సూర్య డైలీలంచం తీసుకుంటూ ఏ సి బి కి పట్టుబడ్డ పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్.

లంచం తీసుకుంటూ ఏ సి బి కి పట్టుబడ్డ పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్.

నిజామాబాద్ జిల్లా : జయజయహే : ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మ పట్టబడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలోని సిసి రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో సదరు కాంట్రాక్టర్ వద్ద 7వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిసి రోడ్డు పనుల బిల్లుల విషయంలో కాంట్రాక్టర్ కు 4 లక్షల 75 వేల రూపాయల సిసి రోడ్డు పనుల బిల్లులు మంజూరు చేయవలసి ఉండగా సదరు కాంట్రాక్టర్ వద్ద 7500 వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేశాడని, అందులో భాగంగా సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు అధికారుల సూచనలకు డబ్బులు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎసిబి డిఎస్పి శేఖర్ గౌడ్ తెలిపారు. ఒక్కసారిగా మండల పరిషత్ కార్యాలయంలో ఏసిబి అధికారుల దాడులతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. ఎసిబి అధికారులకు ఉన్న నిబంధనలు మేరకు సదరు కాంట్రాక్టర్ పేరును వెల్లడించబోమని డిఎస్పి చెప్పారు. విచారణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు సదరు ఉద్యోగిని తీసుకువెళ్తామని డిఎస్పి తెలిపారు. ఆయనతోపాటు ఏసీబీ దాడుల్లో నిజామాబాద్ ఏసీబీ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?