రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం
రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫొటోను రైల్వే టికెట్లపై ముద్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో ఉన్న అన్ని రైల్వే జోన్లకూ ఓ సర్కులర్ ను జారీ చేసినట్లు తెలుస్తోంది. టికెట్లపై ముద్రించాల్సిన ప్రధాని మోదీ ఫొటోను కూడా ఈ సర్కులర్ కు అటాచ్ చేసినట్లు సమాచారం. భారత్- పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ప్రధాని మోదీ పంజాబ్ లోని ఆదమ్‌పూర్ ఎయిర్ బేస్ స్టేషన్‌ను సందర్శించిన విషయం...