రేషన్ కార్డుదారులకు పౌష్టికాహారం
జూన్ నుంచి కందిపప్పు, రాగులు సబ్సిడీ స్టాక్ సిద్ధం జయజయహే : రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కూటమి సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే లక్ష్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుఖాణాల్లో సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు, ఉచితంగా రాగులు ఇచ్చేందుకు పౌరసరఫరాల...