Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీరెండు నిస్సహాయ కుటుంబాలకు అండగా వెల్కమ్ సేవ ఫౌండేషన్

రెండు నిస్సహాయ కుటుంబాలకు అండగా వెల్కమ్ సేవ ఫౌండేషన్

వెల్కమ్ సేవ ఫౌండేషన్ సేవలు కొనసాగాలి

డా. టి. మణికంఠ

జయజయహే : రెండు నిస్సహాయ కుటుంబాలకు అండగా వెల్కమ్ సేవ ఫౌండేషన్ అండగా నిలిచిందని, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు మేనేజర్ డా. టి. మణికంఠ గురువారం అన్నారు. ఎచ్చెర్ల మండలం, అజ్జరాం గ్రామ పంచాయతీకి చెందిన టెంక. రమేష్ , రోజువారీ కూలి పని చేసుకుంటూ, అనారోగ్య కారణంగా, స్థానిక రిమ్స్ వైద్యశాలలో వైద్యం తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో తనువు చాలించారని, ఇంటి పెద్ద దిక్కు కావటంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దీనంగా మారటమే కాకుండా, కనీసం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని, రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు కొంత నగదుని ఈ రోజు కుటుంబ సభ్యులకు అందించామని, వెల్కమ్ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు తాతారావు తెలిపారు. అలాగే డి.మత్స్యలేషం పంచాయతీలో కె.మత్స్యలేషం గ్రామానికి చెందిన నవీన్ అనే నిస్సహాయ కుటుంబానికి వెల్కమ్ సేవ ఫౌండేషన్ తరుపున నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకు మేనేజర్ డా. టి. మణికంఠ చేతులమీదుగా అందించామన్నారు. డా.టి. మణికంఠ మాట్లాడుతూ వెల్కమ్ సేవా ఫౌండేషన్ సేవలుకొనసాగాలని, ఎచ్చెర్ల మండల పరిధిలో ఎవరికి ఏ అవసరమున్న వెల్కమ్ సేవా ఫౌండేషన్ ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్కమ్ సేవ ఫౌండేషన్ ప్రెసిడెంట్ యం.తాతారావు, వైస్ ప్రెసిడెంట్ బి.మురళీమోహన్, సెక్రటరీ దాలిబాబు, ట్రెజరర్ మూర్తి, సురేష్, లక్ష్మణరావు, తాతారావు, అప్పన్న, మాధురి, రమేష్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?