SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 11:59 am Posted by : SHIVASURYA NEWS

రెండవ రోజు జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల

మంగళగిరి జయ జయహే: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి తమ సమస్యలను తెలుసుకుంటూ వారి వద్ద నుండి అర్జీలను సేకరించిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా సెక్రెటరీ నాయకురాలు సోమరౌతు అనురాధ , రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గడ్డం మహాలక్ష్మి ప్రసాద్ లీగల్ సెల్ ప్రతినిధి రత్నం పాల్గొన్నారు.