రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
మాడుగుల : జయజయహే : జూన్ మూడో తేదీన జరగనున్న మాడుగుల శ్రీ మోదకొండమ్మ వారి జాతర నేపథ్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి మోదమాంబ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను సోమవారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోటీని ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందే జట్లకు అందించే ట్రోఫీలను కూడా ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...